

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 62వ రోజు వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం హౌస్‌మేట్స్ ఆటతీరును సమీక్షించిన హోస్ట్ నాగార్జున.. సరిగా ఆడని వారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ముందుగా కొత్త కెప్టెన్‌గా ఎంపికైన వంశీని అభినందించారు. అనంతరం వంశీ, వర్షిణి మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. వర్షిణి ఒక మూలన కూర్చుని ఖాళీగా ఉంటోందనే అర్థం వచ్చేలా వంశీ చేసిన వ్యాఖ్యపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని చర్చించారు.
తాను ఆ వ్యాఖ్యను తప్పుగా ఉద్దేశించి చేయలేదని వంశీ వివరణ ఇవ్వగా.. ఉద్దేశపూర్వకంగానే అలా అన్నాడని వర్షిణి పేర్కొంది. దీనిపై స్పందించిన నాగార్జున.. గతంలో వర్షిణి చేసిన పి అండ్ బి వ్యాఖ్యలతో పోలిస్తే వంశీ అన్న మాట అంత పెద్ద తప్పు కాదని కౌంటర్ ఇచ్చారు. వంశీ వ్యాఖ్యలో అభ్యంతరకరమైన అర్థం ఉన్నప్పటికీ, వర్షిణి దానిని తప్పుబట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆహారం విషయంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రస్తావిస్తూ.. వర్షిణి క్రమంగా షాలినిలా మారుతోందని సెటైర్ వేశారు.
ఆ తర్వాత దేబ్జానీ ఆటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక టాస్క్‌లో ముకేశ్‌తో ఆమె వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ముకేశ్‌ను మగాడు కాదంటూ ఆటలోకి లింగ వివక్షను తీసుకురావడం సరికాదని స్పష్టం చేశారు. ఆటలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా ఉండకూడదని, అందరూ సమానంగా పోటీపడాలని దేబ్జానీకి సూచించారు.
ఇక రివెంజ్ టాస్క్‌లో భాగంగా నిర్వహించిన బ్యాలెన్సింగ్ టాస్క్‌కు నరేష్ సంచాలకుడిగా వ్యవహరించిన విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. నరేష్ నిర్ణయం కారణంగా ముకేశ్, వర్షిణి టాస్క్‌లో గెలవకపోయినా విజేతలుగా ప్రకటించబడ్డారని, దీంతో అమన్, ఆర్కే నష్టపోయారని వివరించారు. సంచాలకుడిగా నరేష్ తప్పు చేసినప్పటికీ, తన తప్పును అంగీకరించేందుకు సిద్ధపడటం, తప్పు చేసి ఉంటే ఈ వారం తన కుటుంబ సభ్యులను కలవనని సవాల్ చేయడాన్ని నాగార్జున అభినందించారు.
అయితే నరేష్ నిజంగానే సంచాలకుడిగా తప్పు చేసినందున ఈ వారం అతడికి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉండదని నాగార్జున ప్రకటించారు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నరేష్‌కు శిక్ష తప్పలేదు. హౌస్‌లో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలని, టాస్క్‌ల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నాగార్జున ఈ సందర్భంగా స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!