
జనరల్

వైవిధ్యమైన పాత్రలతో సినీప్రియులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మరోసారి శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్త్రీ 2 విజయం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఈత’. ఈ సినిమా మహారాష్ట్రకు చెందిన గొప్ప కళాకారిణి విఠాబాయి భావు మంగ్ నారాయణగావ్కర్ జీవితంపై ఆధారంగా రూపొందుతోంది.
ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తుండగా, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఛావా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న విడుదల కానుంది. మే నెలలోనే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం 1940 నుంచి 1990 మధ్య విఠాబాయి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!