

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలి విడుదల తేదీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 11 విడుదల సాధ్యమయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో చిత్రబృందం ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదల చేస్తే సినిమాకు మరింత ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టి-సిరీస్ సమర్పిస్తోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. భారీ స్థాయిలో నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో చిత్రీకరణకు మరింత సమయం అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దసరా లేదా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, పండుగ సీజన్‌లో వస్తే ఈ చిత్రానికి మరింత భారీ ఆరంభం లభించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!