

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ యశ్పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో యశ్ ఒకరని పేర్కొన్న ఆయన, ‘రామాయణ’ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్‌ను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. యశ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, వ్యక్తిత్వం తనను ఎప్పటి నుంచో ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.
రామాయణ చిత్రంలో రాముడు–రావణుడు మధ్య జరిగే కీలక ఘట్టాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయని రణ్‌బీర్ అభిప్రాయపడ్డారు. రావణుడి పాత్రకు యశ్ తనదైన శైలి, ఆరా, నటనతో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారని ప్రశంసించారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!