

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస పరాజయాల తర్వాత మరో విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల విడుదలైన జన నాయగన్ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆమె సినీ ప్రయాణంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే సోషల్ మీడియాలో ఉన్న ఆదరణ, బ్రాండ్ ప్రచారాలతో ఆమెకు గుర్తింపు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై ఆమె దృష్టి కేంద్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
రాధేశ్యామ్, ఆచార్య నుంచి తాజాగా వచ్చిన జన నాయగన్ వరకు పూజా హెగ్డే నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. భారీ పారితోషికం కోరుతున్నారనే ప్రచారంతో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె పాత్ర నిడివి తగ్గించారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో తెలుగులో అవకాశాలు కొంత తగ్గినట్లు భావిస్తున్నారు. అయితే ఆగస్టులో ప్రారంభం కానున్న రవితేజ కొత్త చిత్రంలో ఆమెకు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అభిమానులు మాత్రం పూజా హెగ్డే మరోసారి విజయాల బాట పట్టాలని ఆశిస్తూ ఆమె తదుపరి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!