

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ’ వివిధ భాషల్లో భిన్నమైన స్పందనను అందుకుంటూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తర్వాత మిశ్రమ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌కు మంచి అభిమాన వర్గం ఉన్నప్పటికీ, పరిమిత ప్రమోషన్లు, ఇతర చిత్రాల పోటీ కారణంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.
అయితే హిందీ మార్కెట్‌లో మాత్రం ఈ సినిమా ఆశ్చర్యకరమైన బుకింగ్ ట్రెండ్‌ను నమోదు చేస్తోంది. బుక్‌మైషో తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో హిందీ వెర్షన్‌కు సుమారు 33 వేల టికెట్లు అమ్ముడవగా, తెలుగు వెర్షన్‌కు దాదాపు 28 వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఉత్తర భారతదేశంలో విజయ్ డబ్బింగ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ ‘జన నాయకన్’ హిందీ వెర్షన్ బుకింగ్స్ ద్వారా మరోసారి స్పష్టమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!