

తలైవర్ 173 చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే భారీ సంచలనంగా మారింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దర్శకుడు శంకర్ విలన్‌గా కనిపించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో, ఈసారి వీరు హీరో-విలన్‌గా ఎదురెదురుగా కనిపిస్తే అది అభిమానులకు ప్రత్యేక అనుభూతి అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇది నిజమైతే, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ-కమల్ ఒకే తెరపై కనిపించే అవకాశం ఉంటుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలను అశ్విన్ మరిముత్తు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. రజనీ కోసం ప్రత్యేక లుక్స్ సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!