

నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో తమిళ నటుడు అశోక్ సెల్వన్ భాగమవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆయన కర్ణుడు అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని, పోలీస్ అధికారిగా ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఝాన్సీ రాణిగా టబు కనిపించిన శక్తివంతమైన గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, టబుతో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 2026 డిసెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతుండటంతో అక్కినేని అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!