

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని మాస్ లుక్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే ఆగస్టు 28న సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించగా, షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని కీలక క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది.
ఈ క్లైమాక్స్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన సన్నివేశాన్ని శర్వానంద్ ఒకే టేక్‌లో పూర్తి చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచినట్లు సమాచారం. ఆ సన్నివేశం పూర్తయ్యాక సెట్లో ఉన్న దాదాపు 200 మంది సభ్యులు ఆయన నటనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!