

దక్షిణాది సినిమాలపై తనకున్న గౌరవాన్ని సినీ నటి సమీరా రెడ్డి మరోసారి వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణం ప్రారంభ రోజుల్లో హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో, దక్షిణాది సినిమాల్లో నటించొద్దని తన బృంద సభ్యులు సూచించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో హిందీలో అవకాశాలు లేని వారే దక్షిణాది చిత్రాలకు వెళ్తారనే తప్పుడు అభిప్రాయం ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
అయితే, దక్షిణాది మూలాలను గౌరవిస్తూ ఆ మాటలను పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, సూర్య, అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందని సమీరా తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు కూడా దక్షిణాది సినిమాల కోసం ఆసక్తి చూపుతున్నారని ఆమె పేర్కొన్నారు. దక్షిణాది దర్శకులు కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, అందుకే ఇక్కడి సినిమాలు సాంకేతికంగా ముందుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. త్వరలో సంజయ్ దత్తో కలిసి ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంలో ఆమె ప్రేక్షకులను అలరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!