

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తాజాగా తన కెరీర్లో కొత్త అడుగు వేసింది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉండగా, ఆమె షేర్ చేసిన తాజా ఫోటోలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఒక ఫోటోలో సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో క్లోజ్ హగ్ ఇచ్చుకుంటూ కనిపించడం అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఫోటోలు ఆమె పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభోత్సవ వేడుకలో తీసినవేనని చెబుతున్నారు.
సామ్ ఫోటోలకు క్యాప్షన్‌గా ఇలా రాసింది – ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఉన్న ఈ క్షణాలు నాకు ఎంతో ప్రియమైనవి. గత ఏడాదిన్నర కాలంలో నా కెరీర్లో ఎన్నో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్ తీసుకున్నా, చాలా నేర్చుకున్నాను. నేడు ఆ చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ప్రతిభావంతులైన వ్యక్తులతో పని చేసే అదృష్టం నాకు లభించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ పోస్ట్‌తో అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంగా మారారు. “సమంత తన రిలేషన్‌ను అధికారికం చేసిందా?” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.
రాజ్ – సమంత స్నేహం ‘ది ఫ్యామిలీ మాన్ 2’ మరియు ‘సిటడెల్: హనీ బన్నీ’ షూటింగ్ సమయంలో ప్రారంభమైందని టాక్. ఇప్పుడు “మా ఇంటి బంగారం” ద్వారా వీరి కలయిక మరోసారి తెరపై కనిపించబోతోంది.
ఇక సమంత ప్రొఫెషనల్‌గా కూడా కొత్త దారిలో అడుగుపెడుతోంది. తాజాగా ‘శుభం’ అనే సినిమాతో ఆమె నిర్మాతగా మారింది. కెరీర్లో కొత్త దశలోకి అడుగుపెట్టిన సమంత ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త పేజీ తెరచినట్టే కనిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!