

‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత వేగం అందుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వైట్ అండ్ వైట్ ‘రెడ్డి’ గెటప్‌లో కిరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటివరకు పక్కింటి యువకుడి పాత్రలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన కిరణ్‌కు ఇలాంటి ఫ్యాక్షన్ కథ కొత్త సవాలుగా మారవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ‘దిల్ రుబా’లో బలవంతపు హీరోయిజం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వస్తోంది. ఇదే సమయంలో కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మరో చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన చెఫ్ పాత్రలో కనిపించనున్నారని, ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలనే లక్ష్యంతో ఉన్న కిరణ్ భవిష్యత్తులో ఫ్యాక్షన్ కథను ఎంచుకుంటారా లేదా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!