

మణిపాల్ హాస్పిటల్స్ తమ వైద్య సేవల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. విస్తరణలో భాగంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోనూ కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది.
భౌతికంగా ఆసుపత్రుల విస్తరణతో పాటు ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్‌కేర్ పరిష్కారాలు భవిష్యత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని మణిపాల్ హాస్పిటల్స్ పేర్కొంది. వైద్య సేవల్లో ఏఐ సాంకేతికతను మరింతగా అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేసి, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!