

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఆదివారానికి రూ.40 కోట్ల మార్క్‌ను దాటగా, సోమవారం నాటికి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ 26న విడుదల కావాల్సిన ‘లెనిన్’ చిత్రం జూలై 10కు వాయిదా పడటంతో విడుదలల క్యాలెండర్‌లో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఒక్కడు’, ‘కన్నప్ప’, ‘హనుమాన్ 3డి’, ‘సినిమా చూపిస్త మావా’ వంటి రీ-రిలీజ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వరుసగా పాత చిత్రాల రీ-రిలీజ్‌లపై సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘మా ఇంటి బంగారం’కు బాక్సాఫీస్ వద్ద మరింత అనుకూల వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!