

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ కనిపిస్తోందన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మెటాకు, ఎనిమిది రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్‌లో పోక్సో చట్టం కిందకు వచ్చే ఉల్లంఘనలు ఉండొచ్చని పేర్కొన్న కమిషన్.. ఇలాంటి ప్రకటనలను గుర్తించి తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరింది.
కంటెంట్‌లో బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) ఉన్నట్లు నిర్ధారణ అయితే మెటాపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయకపోతే సంబంధిత పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం దిల్లీలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర అధికారులతో దాదాపు గంటపాటు సమావేశమైంది. డీప్‌ఫేక్‌లు, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్, బాట్ ఖాతాలపై చర్చ జరగగా, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెటా ప్రతినిధులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!