

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో “ఒంటరిగా ఉండడం” అనే క్యాప్షన్‌తో ఒక పోస్ట్ పెట్టడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పోస్టును ఆయన వ్యక్తిగత జీవితంతో అనుసంధానం చేస్తూ అనేక మంది సోషల్ మీడియాలో స్పందించారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ సల్మాన్ స్వయంగా స్పందించారు.
ఆ పోస్ట్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. తాను పెద్ద కుటుంబం, ఎంతోమంది స్నేహితులు, అభిమానుల ప్రేమతో నిండి ఉన్నానని చెప్పారు. ఇంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు తాను ఒంటరిగా ఎలా ఉంటానని ప్రశ్నించారు. కొంత సమయం తన కోసం కేటాయించుకోవాలనిపించిందని, కానీ దానిని పెద్ద విషయంగా మార్చారని పేర్కొన్నారు.
ఈ పోస్టు కారణంగా తన తల్లి కూడా తనను సంప్రదించి ఏమైందని అడిగినట్లు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ త్వరలో ‘మాతృభూమి’తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కనిపించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!