
సినిమాలు

స్టార్ హీరో అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసిన ‘షో స్టాపర్స్–2026’ ప్రత్యేక సంచిక ముఖచిత్రంపై ఆయన చోటు దక్కించుకున్నారు. భారతదేశంలో ప్రభావం చూపుతున్న వంద మంది ప్రముఖులను వారి ఆదరణ, బ్రాండ్ విలువ, ఇతర అంశాల ఆధారంగా ఈ ప్రత్యేక సంచికలో ప్రస్తావించినట్లు సమాచారం.
‘పుష్ప’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. దీంతో ‘షో స్టాపర్స్–2026’ కవర్‌పై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా ఫొటోషూట్, కవర్ షూట్‌కు సంబంధించిన తెరవెనుక దృశ్యాలను అల్లు అర్జున్ పంచుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!