

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా, ‘ది ప్యారడైజ్’ నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడైనట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోగా, డీల్‌లో 50 శాతం వాటాను తమ వద్దే ఉంచుకున్నారు. మిగిలిన 50 శాతంలో నిర్మాత సుధాకర్ చెరుకూరికి 25 శాతం, నిర్మాత నాగవంశీకి 25 శాతం వాటా ఇచ్చారు. ‘దసరా’ ఫుల్ రన్ కలెక్షన్ల కంటే ఎక్కువ ధరకు ఈ డీల్ కుదరడం విశేషంగా మారింది. ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలో హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!