

దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కొత్త ధరల ప్రకారం రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేయవచ్చు. అదేవిధంగా నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించారు. ఇందులో మెట్రోకు రూ.3,000, ఆర్టీసీకి రూ.1,000 కేటాయించారు. ఈ పాస్ ద్వారా నెలకు గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు. దీంతో నెలవారీ పాస్ వినియోగదారులకు రూ.4,500, రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా కానుంది. తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!