

రామాయణ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో ఇప్పుడు దర్శకుడు నితేష్ తివారీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ చిత్రంలోని విజువల్స్, కథను తెరపై చూపించిన విధానం సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో నితేష్ తివారీని పోలుస్తూ చర్చలు మొదలయ్యాయి.
ముఖ్యంగా రామాయణలో ఆయన చూపించిన విజన్ గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే రాజమౌళి కంటే నితేష్ తివారీ ఆలోచనా విధానం గొప్పగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ పోలికలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజమౌళి తన సినిమాలతో సృష్టించిన ప్రత్యేకమైన గుర్తింపును దృష్టిలో పెట్టుకుంటే, నితేష్ తివారీకి ఇలాంటి ప్రశంసలు రావడం విశేషమే. రామాయణకు వస్తున్న స్పందనతో ఈ ఇద్దరు దర్శకుల మధ్య పోలికలు మరింత పెరిగే అవకాశముంది. మరి వారణాసితో రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!