

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ఓటీటీ హక్కుల విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన చర్చల్లో ఏకంగా రూ.100 కోట్ల వ్యత్యాసం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకే సంస్థకు మొత్తం డిజిటల్ హక్కులు ఇచ్చే బదులు కొత్త పద్ధతిలో ముందుకెళ్లాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారణాసి ఓటీటీ హక్కులను 3 విభాగాలుగా విక్రయించే ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దక్షిణాది భాషలకు ఒక ప్యాకేజీ, హిందీకి మరో ప్యాకేజీ, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకంగా ఇంకో ప్యాకేజీ రూపొందించనున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా డిజిటల్ హక్కుల నుంచి భారీ మొత్తాన్ని రాబట్టవచ్చని భావిస్తున్నారట. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు ఓటీటీ వ్యాపారంలోనూ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారనే చర్చ నడుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!