
క్రీడలు

రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ భారీ పౌరాణిక చిత్రంలోని తొలి భాగానికి ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ అనే అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు ‘రామాయణ: పార్ట్-1’గా పిలుస్తున్న ఈ చిత్రానికి తాజాగా ఉపశీర్షికను ఖరారు చేశారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. మానవాళి చరిత్రలోని గొప్ప కథకు తెర రూపం ఇస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఐమ్యాక్స్ కోసం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘రామాయణ’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం దీపావళి సందర్భంగా విడుదల కానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!