
జనరల్

పెద్ది సినిమా నుంచి కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుచ్చిబాబుసనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేస్తారా లేదా డిజిటల్‌గా విడుదల చేస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!