

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో మరో ప్రత్యేకమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్‌తో చేయబోతున్న ఆర్సీ 17 సినిమా కోసం ఆయన సరికొత్త రూపంలో కనిపించనున్నారట. ఇప్పటికే పెద్ది సినిమా కోసం లాంగ్ హెయిర్ పెంచడంతో పాటు శరీరాకృతిలో మార్పులు చేసుకుంటున్న చరణ్, ఇప్పుడు సుకుమార్ చిత్రానికి తగ్గట్టుగా మరోసారి తన రూపాన్ని మార్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈసారి ప్రత్యేక శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తూ, పాత్రకు అవసరమైన శరీరాకృతిని సాధించే ప్రయత్నం చేస్తున్నారట.
సుకుమార్ ఈ సినిమాలో చరణ్‌ను పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కథలోని పాత్ర బరువుకు తగ్గట్టుగా తెరపై బలమైన ప్రభావం కనిపించేలా చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. రంగస్థలం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చరణ్ తన లుక్, వ్యక్తిత్వంలో చేసుకోబోతున్న మార్పులు ఎలా ఉంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!