

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తదుపరి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఘన విజయం సాధించడంతో, మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పెద్ది తర్వాత చరణ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ భారీ హైప్ కనిపిస్తోంది.
ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠకు తాజాగా తెరపడినట్లు తెలుస్తోంది. ఈ దసరా సందర్భంగా ముహూర్త కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ భారీ స్కేల్‌లో తెరకెక్కించనున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!