

భారత్‌లో తయారైన బీఎస్ఏ బ్యాంటమ్ బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. బైక్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన బోరిస్ జాన్సన్, సాంకేతిక రంగంలో భారత్-బ్రిటన్ సహకారానికి ఇది మంచి ఉదాహరణ అని అన్నారు. బీఎస్ఏ బైక్‌లను ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ భారత్‌లో తయారు చేసి, యూకేతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. బోరిస్ జాన్సన్ భారతీయ తయారీ బైక్‌ను ఆస్వాదించడం సంతోషంగా ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అదే సమయంలో బీఎస్ఏ పేరును ‘బోరిస్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ’గా మార్చమని మాత్రం అడగవద్దంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హమ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1861లో చిన్న ఆయుధాల తయారీతో ప్రారంభమైన ఈ సంస్థ అనంతరం మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిలోకి ప్రవేశించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బీఎస్ఏ బైక్‌లు కీలక పాత్ర పోషించగా, 1950లను సంస్థ స్వర్ణయుగంగా పేర్కొంటారు. అయితే పాతబడిన సాంకేతికత, కార్మికుల ఆందోళనలు తదితర కారణాలతో 1970ల నాటికి ఉత్పత్తి నిలిచిపోయింది. 2016లో మహీంద్రా గ్రూప్ బీఎస్ఏలో 100 శాతం వాటాను కొనుగోలు చేసి, బ్యాంటమ్ మోడల్‌ను పునరుద్ధరించింది. ప్రస్తుతం బీఎస్ఏ గోల్డ్‌స్టార్, స్క్రాంబ్లర్‌తో పాటు బ్యాంటమ్ బైక్‌లు భారత్‌లో తయారవుతూ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!