

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల రిలేషన్షిప్స్లో మోసం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది. పతి పత్ని ఔర్ వో 2 ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొన్న ది బాంబే జర్నీ టాక్ షోలో రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
రిలేషన్షిప్లో మోసం చేయడాన్ని తాను అంగీకరించనని రకుల్ చెప్పింది. అయితే జీవితంలో ఒకసారి తప్పు చేసి నిజంగా క్షమాపణ చెబితే క్షమించవచ్చని, కానీ అదే అలవాటుగా మారితే మాత్రం అస్సలు సహించకూడదని స్పష్టం చేసింది. వెంటనే తన వ్యాఖ్యలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావని, భర్త జాకీ భగ్నానీకి ఈ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి పుకార్లకు చెక్ పెట్టింది. ఇదే చర్చలో పాల్గొన్న సారా అలీ ఖాన్, తాను క్షమించగలనేమో కానీ ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!