

ముంబైలో ఇటీవల జరిగిన ఐటీ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్ ప్రీత్‌సింగ్ స్పష్టం చేశారు. నిర్మాత వాసు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన 12 ప్రాంతాల్లో అనుమానిత ఆర్థిక అవకతవకలు, విదేశీ లావాదేవీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన రకుల్.. తనకు సంబంధం లేని విషయాలను వాస్తవాలు సరిచూసుకోకుండా సంచలనం కోసం ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
తాను సాయుధ దళాల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని, సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నానని రకుల్ తెలిపారు. 20 ఏళ్ల వయసు నుంచే పన్నులు చెల్లిస్తున్నానని, వ్యక్తిగతంగా గానీ, ఏ నిర్మాణ సంస్థ తరఫున గానీ చట్టవిరుద్ధమైన విదేశీ నగదు బదిలీల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. భారత్‌లో లేదా విదేశాల్లో తనకు బినామీ ఆస్తులు లేవని, ఖరీదైన బహుమతులు కూడా స్వీకరించనని పేర్కొంటూ తప్పుడు వార్తలను వెనక్కి తీసుకోవాలని మీడియాను కోరారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!