

ప్రపంచ మార్కెట్లో భారతీయ సినిమాలకు మరింత ఆదరణ పెంచేందుకు దర్శకులు, నిర్మాతలు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రాన్ని ఇంగ్లీష్‌లోనూ చిత్రీకరించి అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ కోసం AI లిప్-సింక్ టెక్నాలజీని ఉపయోగించి నటీనటుల భావోద్వేగాలకు భంగం కలగకుండా ఇంగ్లీష్ వెర్షన్‌ను అందించే ప్రయత్నం జరుగుతోంది.
అయితే మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం దర్శకుడు రాజమౌళి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత తెలుగులో విడుదల చేసి, అంతర్జాతీయ మార్కెట్లలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించనున్నట్లు సమాచారం. కథ, కథనం, విజువల్స్ బలంగా ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చనే ఆలోచనతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!