

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర వెనుక పెద్ద రహస్యం దాగి ఉందని తెలుస్తుంది.అతడు సాధారణ ప్రతినాయకుడు కాదని, రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడి పునర్జన్మ కావచ్చని ఓ కథనం వైరల్ అవుతోంది. రామాయణ కాలంలో విడిపోయిన రావణుడి శక్తివంతమైన ‘నవరత్న మాల’ను తిరిగి సేకరించాలన్నది కుంభ లక్ష్యమని, ఆ బాధ్యతను మహేష్ బాబుకు అప్పగిస్తాడని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ 9 రత్నాలు తనకు దక్కితే కుంభకు అపారమైన శక్తులు లభిస్తాయని తెలుసుకున్న రుద్ర, అతడి ప్రయత్నాలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడట. ఇందుకోసం కాల ప్రయాణం ద్వారా రామాయణ కాలానికి వెళ్తాడనే మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. పురాణ గాథలకు ఆధునిక సాంకేతికత, కాల ప్రయాణం, సాహసాలను జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే ఈ కథనంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ఊహాగానాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!