
సినిమాలు

రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్య ప్రయత్నాలు మరోసారి వేగం పుంజుకున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు అబుదాబిలో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా కీలకంగా మారిన ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు, చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మాట్లాడారు. చర్చల ప్రక్రియలో సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలే కీలకమని భారత్ మొదటి నుంచీ చెబుతోంది. అబుదాబి సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!