

ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్ గెలుచుకున్నారు. ఆయన రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ నవలకు ఈ పురస్కారం దక్కింది. లండన్‌లో నిర్వహించిన అవార్డు వేడుకలో విజేతను ప్రకటించారు. 81 ఏళ్ల వయసులో ఈ పురస్కారాన్ని అందుకున్న హారిసన్, బుకర్ ప్రైజ్ చరిత్రలోనే అత్యంత వృద్ధ విజేతగా రికార్డు సృష్టించారు. ఈ విజయంతో ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన సాహితీ ప్రస్థానానికి మరో అరుదైన గుర్తింపు లభించింది.
‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ నవల సమాజ పతనం, భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది. ఈ రచనను ఆరుగురు రచయితలతో కూడిన షార్ట్‌లిస్ట్ నుంచి న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ ఏడాది బుకర్ ప్రైజ్ కోసం మొత్తం 163 నవలలను పరిశీలించారు. విజేతగా నిలిచిన హారిసన్‌కు 50 వేల పౌండ్ల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి సైన్స్ ఫిక్షన్ నేపథ్య రచయితగా కూడా ఆయన గుర్తింపు పొందారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!