
గాసిప్స్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ సినిమా విడుదలపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ముందుగా ప్రకటించినట్లుగానే 2027లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. మహేశ్‌బాబు కథానాయకుడిగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది.
కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పనులు ప్రణాళిక ప్రకారమే సాగుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’ను నిర్ణీత సమయంలోనే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా నిర్ణయించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!