

టాలీవుడ్ నటి రాశి ఖన్నా ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానాలు ఇచ్చారు. ఒంటరిగా అనిపించినప్పుడు ఆ భావనను ఎలా ఎదుర్కొంటారని ఓ అభిమాని అడగగా ఒంటరితనం కలిగినప్పుడు ఆ భావాలను దాచుకోకుండా పూర్తిగా అనుభవిస్తానని రాశి చెప్పారు. కన్నీళ్లు వస్తే వాటిని ఆపుకోనని, భావాలను అణచివేయకుండా సహజంగా వ్యక్తం చేస్తానని, వాటితో అనవసరంగా పోరాడనని తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనల నుంచి తాను నేర్చుకున్న ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా రాశి ఖన్నా పంచుకున్నారు. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని నియంత్రించడం కాదని, వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమేనని చెప్పారు. ప్రేమలో ఉన్నామనే కారణంతో ఎదుటివారు తమతోనే ఉండాలని బలవంతం చేయకూడదని, వారికి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. అదే సమయంలో మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా మన ఎదుగుదలపై దృష్టి పెట్టాలని రాశి అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!