
షోస్

ఐదో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేసి 42.1 ఓవర్లలోనే 209 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ చెరో 46 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5), శ్రేయస్ అయ్యర్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18), నమన్ ధీర్ (22) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు సాధించగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, బ్లెయిర్ టిక్నర్ తలో వికెట్ తీసుకున్నారు. వీరి సమష్టి ప్రదర్శనతో భారత ఇన్నింగ్స్ 209 పరుగుల వద్ద ముగిసింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!