

భారత్‌లో వివాహ బంధాలు, వివాహేతర సంబంధాలపై ఆసక్తికర చర్చకు ఓ సర్వే తెరలేపింది. వివాహేతర డేటింగ్ ప్లాట్‌ఫామ్ గ్లీడెన్ (Gleeden) కోసం ఐపీఎస్ఓఎస్ (IPSOS) నిర్వహించిన ఈ అధ్యయనంలో 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 1,525 మంది వివాహితులు పాల్గొన్నారు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేపట్టారు. ఇందులో పాల్గొన్న వివాహిత మహిళల్లో 53 శాతం మంది తమ వివాహ బంధానికి వెలుపల సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారని సర్వే వెల్లడించింది. అదే సమయంలో పురుషుల్లో ఈ శాతం 43గా నమోదైంది.
ఈ ఫలితాలు వివాహేతర సంబంధాల విషయంలో మహిళలు, పురుషులు వెల్లడించిన అభిప్రాయాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తున్నాయి. దీంతో సర్వే వివరాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ గణాంకాలు సర్వేలో పాల్గొన్న వారి సమాధానాల ఆధారంగా వచ్చినవే తప్ప.. దేశంలోని మొత్తం వివాహితుల పరిస్థితికి ప్రతిబింబం కావు. సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య, ఎంపిక చేసిన నగరాలు, పరిశోధన విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ ఫలితాలను అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!