
ఓటీటీ

ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై 17 ఏళ్ల మైనర్ స్కూటర్ నడిపిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ వంతెనపై ద్విచక్ర వాహనాలకు అనుమతి లేకపోయినా, నిబంధనలను ఉల్లంఘించి మైనర్ స్కూటర్ నడిపినట్లు గుర్తించారు. అంతేకాకుండా అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని సమాచారం.
మైనర్‌కు స్కూటర్ ఇచ్చిన అతడి బాబాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్‌కు డ్రైవింగ్ అర్హత లేదని తెలిసినా వాహనం ఇచ్చినందుకు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్లు 180, 181 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనల ప్రకారం వాహన యజమానికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!