
షోస్

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రచించిన జీవిత జ్ఞాపకాల పుస్తకం ‘Belonging’ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఈ పుస్తకం 1.40 లక్షలకు పైగా కాపీలు అమ్ముడైనట్లు సమాచారం. తక్కువ సమయంలోనే ఇంతటి ఆదరణ లభించడంతో పుస్తకం వార్తల్లో నిలిచింది.
ఈ అమ్మకాలతో ‘Belonging’ భారత్‌లో ఇప్పటివరకు అత్యంత వేగంగా అమ్ముడైన రాజకీయ జీవిత చరిత్ర పుస్తకంగా రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, అనుభవాల గురించి తెలుసుకోవాలనే పాఠకుల ఆసక్తికి ఈ అమ్మకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!