
బిజినెస్

రామ్-లీలా, దోస్తానా సినిమాల్లో అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా మొదట్లో ఈ రంగంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభంలో స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్, కో-స్టార్స్‌తో సమన్వయం చేయడం చాలా కష్టంగా అనిపించేదని వెల్లడించారు. ఈ పరిస్థితులు ఆమెను కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేశాయని తెలిపారు.
సౌత్ ఆఫ్రికాలో ఓ పాట చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ అందరి ముందే తనపై కోపంగా మాట్లాడిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో ప్రతిరోజూ ఆరు గంటల పాటు కత్రినా కైఫ్ తో కలిసి ప్రాక్టీస్ చేసి తన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని చెప్పారు. ఆమె ప్రయాణం కష్టపడి సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!