

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబడింది. సుకుమార్ రైటింగ్స్ సంస్థ, బన్నీ వాస్ వర్క్స్‌తో కలిసి ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించనుండగా, ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా కనిపించనుంది. వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్రొడక్షన్ నెం.1’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రం పూజా కార్యక్రమం జూన్ 25న ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో నిర్వహించనున్నారు. “From the fragrance of our soil, every home has a story” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను విడుదల చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!