
యంగ్ హీరో, దర్శకుడు Pradeep Ranganathan తన టాలెంట్‌తో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా సత్తా చాటిన ఆయన, నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన Dude సినిమాతో విజయాన్ని అందుకున్న ప్రదీప్, ఫిబ్రవరిలో LIK తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇదిలా ఉండగా, తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఆయనే దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. AGS Entertainment బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో ఉండనుందని, విజువల్‌గా గ్రాండ్‌గా రూపొందించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో హీరోయిన్గా ఇప్పటికే తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో మంచి అవకాశాలు అందుకుంటున్న Meenakshi Chaudhary నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ సినిమా వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రదీప్ మళ్లీ మెగా ఫోన్ పట్టడం అభిమానులను ఉత్సాహపరుస్తుండగా, ఆయన సినిమాల్లో హీరోయిన్ల ఎంపిక ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందన్న కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!