

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ఈ వారం ఝాన్సీ, రోహిత్ ఎలిమినేట్ అయినట్లు కథనాలు చెబుతున్నాయి. టాప్ 5లో ఉంటాడని భావించిన రోహిత్, తన ప్రవర్తనతో పాటు టాస్కుల్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో అవకాశాలను కోల్పోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతని ఎలిమినేషన్‌తో ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు? విజేతగా ఎవరు నిలుస్తారు? అనే చర్చ మొదలైంది.
ఇప్పటివరకు ఆటతీరును పరిశీలిస్తే త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, అమన్ టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. మరో స్థానం కోసం నరేష్, రామ్ ప్రసాద్ మధ్య పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. రోహిత్ వెళ్లిపోవడంతో త్రిగుణ్‌కు ముకేశ్ గట్టి పోటీ ఇవ్వగలడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత రెండు మూడు వారాలుగా ముకేశ్ తన ఆటతీరును మెరుగుపరుచుకోగా, త్రిగుణ్ దూకుడైన ఆటతో పాటు వ్యూహాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ట్రోఫీ రేసులో త్రిగుణ్ ముందున్నాడనే అంచనాలు ఉన్నప్పటికీ, చివరి వరకు పరిస్థితులు మారే అవకాశం ఉంది. అంతిమ విజేత ఎవరో ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!