

అంతర్జాతీయంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని రెండు రోజుల్లో తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా తమ ప్రధాన షరతులను అంగీకరించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఖతార్ మధ్యవర్తులతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో జలసంధిని తెరిచేందుకు ప్రతిపాదించిన గడువును గతంలో ఉన్న ఐదు రోజుల నుంచి రెండు రోజులకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ప్రతిపాదన ప్రకారం మొదటి రోజు అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటే, రెండో రోజు నుంచి హార్ముజ్ జలసంధిలో నౌకాయానం పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అయితే ఇరు దేశాల మధ్య ఇంకా తుది ఒప్పందం కుదరలేదు.
అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడం, పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలగాల ఉనికిని తగ్గించడం, ఇరాన్ చమురు ఎగుమతులకు సంబంధించిన మినహాయింపులను పునరుద్ధరించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడం వంటి డిమాండ్లను టెహ్రాన్ ముందుంచినట్లు సమాచారం. ఒమన్‌తో చర్చించిన హార్ముజ్ నౌకాయాన మార్గాలకు గుర్తింపు ఇవ్వాలని కూడా ఇరాన్ కోరుతోంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో దౌత్య చర్చలు కొనసాగుతుండగా, అమెరికా స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తదుపరి చర్చలకు మార్గం సుగమం కావచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!