2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

Writer: Pooja 02:45 PM, 2 నవంబర్, 2026
విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

భారత్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు విదేశీ మదుపర్లపై విధిస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (LTCG Tax) పూర్తిగా తొలగించాలనే ప్రతిపాదనకు సెబీ మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసినట్లు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా చూడటంతో పాటు, రూపాయి విలువను బలోపేతం చేయడం కూడా ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశాలుగా తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్ను మినహాయింపుతో పాటు దేశీయ మదుపర్లకు కూడా పన్ను ఊరట కల్పించాలని సెబీ సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దేశీయ మదుపర్లు ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలలో ఉన్న పెట్టుబడులను విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కొత్త పథకాల్లో తిరిగి పెట్టుబడి పెడితే ఎల్‌టీసీజీ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సెబీ ప్రతిపాదించినట్లు సమాచారం. గత రెండేళ్లుగా భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు భారత మార్కెట్ల నుంచి 31 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.94 లక్షల కోట్లు) నిధులను వెనక్కి తీసుకున్నారు. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుతం 12 నెలలకు మించి తమ వద్ద ఉంచుకునే బాండ్లు, లిస్టెడ్‌ షేర్లపై విదేశీ మదుపర్లు 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను చెల్లిస్తున్నారు.

ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుల తొలగింపునకు సంబంధించి బడ్జెట్‌ సంప్రదింపుల్లో వచ్చే సూచనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో సెబీ సిఫార్సులు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపుపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. పన్ను విధానంలో మార్పులు చేయాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

ట్యాగ్లు
సెబీఎల్‌టీసీజీ పన్నువిదేశీ పెట్టుబడులుభారత స్టాక్ మార్కెట్మ్యూచువల్ ఫండ్స్కేంద్ర బడ్జెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్
జనరల్

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ
క్రీడలు

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌
రాజకీయాలు

మోదీని శకునితో పోల్చిన తేజస్వీ..జ్ఞానేశ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్‌

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !
సినిమాలు

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి ప్రాసిక్యూట్‌ చేయాలి - ఎంఏ బేబీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించి ప్రాసిక్యూట్‌ చేయాలి - ఎంఏ బేబీ

జమ్మూ కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే - ఫరూఖ్‌ అబ్దుల్లా
రాజకీయాలు

జమ్మూ కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే - ఫరూఖ్‌ అబ్దుల్లా

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.
క్రీడలు

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.

నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి
గాసిప్స్

నాని - సుజీత్ 'బ్లడీ రోమియో' సెట్స్ నుంచి లీకులు: చిత్ర యూనిట్‌కు తలనొప్పి

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం
బిజినెస్

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్
సినిమాలు

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం
బిజినెస్

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్
జనరల్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!