

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో విడుదలకు ముందే ఎడిటింగ్ సమయంలో దాదాపు 100 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. తొలగించిన సన్నివేశాలను విడుదల తర్వాతైనా సినిమాలో చేర్చాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’ ఓటీటీ వెర్షన్‌పై కొత్త ప్రచారం మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కు అదనంగా 20 నుంచి 30 నిమిషాల సన్నివేశాలను జోడించి ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ చర్చిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అభిమానులకు పొడిగించిన వెర్షన్ చూసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!