

నటి ఇమాన్వి (ఇమాన్ ఇస్మాయిల్) తన 31వ పుట్టినరోజును నిన్న జరుపుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ఫౌజీ’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కానున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు ప్రత్యేక సర్ప్రైజ్లు ఇవ్వగా, ప్రభాస్ పంపిన ప్రత్యేక విందు అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని ప్రభాస్ ఆమెకు పంపించారు. ఈ సందర్భంగా ఇమాన్వి ఆ విందు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ పంపిన విందులో బిర్యానీ, పులావ్‌తో పాటు చికెన్ 65, చిల్లీ చికెన్, సీక్ కబాబ్స్, షమీ కబాబ్స్, తందూరీ చికెన్ వంటి స్టార్టర్లు ఉన్నాయి. కూరలు, గ్రేవీలు, సాలన్, రైతా, చట్నీలతో పాటు ఆప్రికాట్ డిలైట్, ఫిర్నీ వంటి డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం 2027కు వాయిదా పడింది. అయితే, కొత్త విడుదల తేదీని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!