

ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టు ఎక్కించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అభిమానుల్లో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. చిత్ర బృందం గతంలో ప్రకటించిన విడుదల తేదీపై ఇప్పటివరకు పెద్దగా కొత్త సమాచారం బయటకు రాకపోవడంతో సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన రాజమౌళిని ‘వారణాసి’ గురించి ప్రశ్నించగా, త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు. దీంతో అభిమానుల్లో మళ్లీ చర్చ మొదలైంది. సినిమా గురించి మాట్లాడినందుకు సంతోషించాలా, లేక స్పష్టమైన విడుదల వివరాలు చెప్పకపోవడంతో నిరాశ చెందాలా అనే పరిస్థితి నెలకొంది. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజమౌళి చెప్పిన త్వరలో అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!