

వరుస విజయాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సాధారణంగా కుటుంబ కథలు, వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించే ఆయన ఈసారి పూర్తిగా భిన్నమైన ప్రయత్నానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అనిల్ రావిపూడి రామాయణం ఆధారంగా యానిమేషన్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. అప్పట్లో ఈ ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఆయనే స్వయంగా స్పందించడంతో వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తన మనసుకు ఎంతో దగ్గరైన కలల ప్రాజెక్ట్ రామాయణం యానిమేషన్ చిత్రం అని ఆయన వెల్లడించారు.
57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు వినోదాత్మక కథలతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి, పురాణ ఇతిహాసాన్ని యానిమేషన్ రూపంలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తే మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. అయితే నిర్మాణం ఎప్పుడు మొదలవుతుంది, ఇతర వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారనేది చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!