

టాలీవుడ్‌లో ఒకప్పుడు పెద్ద చిత్రాలు దూరంగా ఉండే డిసెంబర్ నెల ఇప్పుడు అగ్ర హీరోల విడుదలలకు ప్రధాన వేదికగా మారుతోంది. గత కొన్నేళ్లుగా ఈ సీజన్‌లో భారీ విజయాలు నమోదవుతుండటంతో స్టార్ హీరోలు కూడా ఇదే సమయాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈసారి కూడా ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వరుస రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’, నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి నెలపై అందరి దృష్టి పడింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్ ‘ఫౌజీ’ని డిసెంబర్ 3న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. తొలుత దసరా విడుదలగా భావించిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా తేదీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నప్పటికీ వరుస రోజుల్లో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!