

విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ జులై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డు సూచించిన 12 మార్పులను పూర్తి చేసిన అనంతరం చిత్రబృందం విడుదలకు సిద్ధమైంది. భారత్‌లో ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించగా, కొన్ని డైలాగ్‌లు, పదాలు, సన్నివేశాల్లో మార్పులు చేసి విడుదల చేస్తున్నారు. అయితే యూకేలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా అన్‌కట్ వెర్షన్ విడుదలకు అనుమతి లభించింది.
మరోవైపు, విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కార్డులో కూడా మార్పు చేశారు. గతంలో ఉన్న ‘దళపతి విజయ్’ స్థానంలో ‘తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్’ అనే టైటిల్ కార్డు ప్రదర్శించనున్నట్లు సమాచారం. అలాగే విజయ్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రస్తావన ఉన్న కొన్ని డైలాగ్‌లను తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది. విడుదలకు ముందు సినిమా రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల కానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!